Atchannaidu: ఆసుపత్రికి తరలించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు

Atchannaidu files petition in AP High Court
  • నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అచ్చెన్న
  • అట్నుంచి అటే సబ్ జైలుకు తరలించిన పోలీసులు
  • హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  
  • రేపు విచారణ చేపట్టనున్న హైకోర్టు
ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, ఆయనను పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించడం తెలిసిందే. అయితే, తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అంతకుముందు, అచ్చెన్నాయుడు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
Atchannaidu
Petition
AP High Court
ESI Scam
Hospital

More Telugu News