Iliyana: ఇలియానాకు కోపం తెప్పించిన నెటిజన్ ప్రశ్న... ఘాటు సమాధానం!

Iliyana Reply to Netigen on Relationship
  • ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారా? అని ప్రశ్న
  • ఇతరుల అఫైర్లు మీకెందుకన్న ఇల్లీ
  • ఇలియానా సమాధానం సూపరంటున్న నెటిజన్లు
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తన గురించిన అన్ని విషయాలనూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకునే గోవా బ్యూటీ ఇలియానా, లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెప్పింది. అంతవరకూ ఓకే, పలు ప్రశ్నలకు ఆమె ఆన్సర్స్ ఇస్తుంటే, ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న ఇలియానాకు ఆగ్రహాన్ని తెప్పించింది.

"మీరు ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారా? లేక ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నారా?" అన్నదే ఆ ప్రశ్న. దీంతో చిర్రెత్తుకొచ్చిందో ఏమో, ఓ జంతువు ఫోటోను పోస్ట్ చేస్తూ, "ఇతరుల అఫైర్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనకు చాలా ఎక్కువగా ఉంటుంది కదా?" అని వ్యాఖ్యానించింది. దీంతో ఇలియానా సరిగ్గా స్పందించిందని పలు కామెంట్లు కూడా వచ్చాయి.

కాగా, ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఇలియానా డేటింగ్ చేసింది. ఆపై గత ఆగస్టులో వీరిద్దరూ విడిపోగా, అప్పటి నుంచి ఇలియానా సింగిల్ గానే ఉంటోంది.
Iliyana
Question
Relationship

More Telugu News