Foot Over Bridge: అద్భుతమైన డిజైన్లు, అదిరిపోయే లుక్.. హైదరాబాద్‌లో 37 నయా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు

Telanagana Govt Issues work Order for 37 FOBs in Hyderabad
  • విశాలంగా, గాలి, వెలుతురు ప్రసరించేలా డిజైన్
  • నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఎఫ్ఓబీలు
  • వర్క్ ఆర్డర్ జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 37 ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. ఇప్పటికే వీటి డిజైన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం వర్క్ ఆర్డర్లు కూడా జారీ చేసింది. మోడర్న్ లుక్‌తో చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ వంతెనలు నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. విశాలంగా, సురక్షితంగా, గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా వీటిని డిజైన్‌ చేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ఫుట్ ఓవర్ వంతెనలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
Foot Over Bridge
Hyderabad
Telangana

More Telugu News