Face mask: మాస్కులు ధరించకుండా చక్కర్లు.. 67,557 మందిపై కేసులు

Telanga police files cases against 67 thousand people for not wearing masks
  • అత్యధికంగా హైదరాబాద్‌లో 14,931 కేసుల నమోదు
  • 3,288 మందికి ఈ-చలానాల జారీ
  • అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు  
తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాదకరంగా పెరుగుతున్నా ముఖానికి మాస్కులు ధరించకుండా బహిరంగంగా చక్కర్లు కొడుతున్న 67,557 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, మరో 3,288 మందికి ఈ-చలానాలు జారీ చేసినట్టు చెప్పారు. 22 మార్చి నుంచి 30 జూన్ మధ్య ఈ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇక, రాజధాని హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 14,931 కేసులు నమోదు కాగా, రామగుండం కమిషనరేట్ పరిధిలో 8,290, ఖమ్మంలో 6,372, సూర్యాపేటలో 4,213, వరంగల్‌లో 3,907 మందిపై కేసులు నమోదు కాగా, అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
Face mask
Telangana
cases
Hyderabad

More Telugu News