India: బంగారం ధరలో ఆల్ టైమ్ న్యూ రికార్డ్!

Gold Price All Time Record in India
  • వరుసగా రెండో రోజూ రికార్డు
  • రూ. 48,829కి పది గ్రాముల ధర
  • ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు 1,801 డాలర్లకు చేరిక
ఇండియాలో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. బుధవారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 48,829కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 67 అధికం. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలో కొత్త రికార్డు నమోదైనట్లయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 8 సంవత్సరాల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలోనే ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో బంగారం ధర రూ. 49 వేలను దాటి ముందుకు సాగుతుందని వెల్లడించారు.

కాగా, ఔన్సు బంగారం ధర ఈ ఉదయం ఆసియా మార్కెట్లో 1,801 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా రెండో దశ కేసులు పలు దేశాల్లో విజృంభిస్తున్న వేళ, తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ సేఫ్ గా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తూ ఉండటంతోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి యూఎస్ మార్కెట్లో బంగారం ధర ఏకంగా 19.30 డాలర్లు పెరగడం గమనార్హం.
India
Gold
High
Record

More Telugu News