Imran khan: కరాచీ ఉగ్రదాడి వెనుక భారత్ హస్తం: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు

Pak PM Imran khan alleged that India behind karachi attack
  • భారత్‌పై విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్
  • దాడి తమ పనేనని ప్రకటించిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ
  • అయినా భారత్‌నే వేలెత్తి చూపుతున్న ఇమ్రాన్
పాకిస్ధాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై మరోమారు విషం కక్కాడు. సోమవారం కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై జరిగిన దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే, ఇమ్రాన్ మాత్రం భారత్‌ను వేలెత్తి చూపారు. కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై దాడి వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. నిన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కరాచీ దాడి వెనక భారత్ ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదన్న ఇమ్రాన్.. గతంలో ముంబైలో జరిగిన దాడి తరహాలోనే కరాచీలో చేయాలనుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Imran khan
Pakistan
India

More Telugu News