Asaduddin Owaisi: చైనా గురించి మాట్లాడకుండా 'చనా' గురించి మాట్లాడారు: మోదీపై ఒవైసీ ఫైర్

Instead of China PM Modi spoke on chana says Owaisi
  • ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ
  • చైనా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒవైసీ మండిపాటు
  • ప్లానింగ్ లేకుండా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఆహారం లేక అలమటించారంటూ విమర్శ
ప్రధాని మోదీ ఈరోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశం గురించి మాట్లాడతారని ఆశించిన వారికి నిరాశే మిగిలిందని అన్నారు. చైనా గురించి మాట్లాడతారనుకుంటే చనా (శనగలు) గురించి మాట్లాడారని ఎద్దేవా చేశారు. దేశ సరిహద్దులు ఉద్రిక్తంగా ఉన్నా... దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు.

ఏమాత్రం ప్లానింగ్ లేకుండా లాక్ డౌన్ విధించారని... దాని వల్ల ఎంతో మంది ప్రజలు ఆహారం లేకుండా అలమటించారని విమర్శించారు. తమరి అనాలోచిత ధోరణి నేపథ్యంలో ప్రజలకు చనా కూడా ముఖ్యమేనని అన్నారు. రానున్న రోజుల్లో వస్తున్న ఎన్నో పండుగల గురించి తమరు ప్రస్తావించారని... అయితే బక్రీద్ గురించి మాట్లాడటం మిస్ అయ్యారని విమర్శించారు. అయినప్పటికీ మీకు ఈద్ ముబారక్ చెపుతున్నామని అన్నారు.
Asaduddin Owaisi
MIM
Narendra Modi
BJP
China
Lockdown

More Telugu News