Vanitah Vijayakumar: ఇది నీకు సంబంధం లేని విషయం.. వేలు పెట్టకు: తన మూడో పెళ్లిపై ప్రశ్నించిన నటిపై వనిత ఫైర్

Vanitha Vijayakumar fire on Actress Lakshmi Ramakrishnan
  • భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా పెళ్లాడారంటూ లక్ష్మి ప్రశ్న
  • ఇంత పెద్ద తప్పు ఎలా చేశారని వ్యాఖ్య
  • మీ పని మీరు చేసుకుంటే మంచిదంటూ కౌంటర్ 
సీనియర్ నటులు విజయకుమార్, మంజుల దంపతుల కుమార్తె వనిత విజయకుమార్ ఇటీవలే మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పీటర్ పాల్ అనే విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ ని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినీనటి, యాంకర్ లక్ష్మీ రామకృష్ణన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నారంటూ వనితను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదివి, సెలబ్రిటీలుగా ఉన్నవారు ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారని అడిగారు. ఈ పెళ్లిని పీటర్ మొదటి భార్య ఎందుకు ఆపలేదని కూడా ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో లక్ష్మీ రామకృష్ణన్ పై వనిత మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఎందుకు విడిపోతారో? ఎందుకు విడాకులు తీసుకుంటారో నీకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇది నీకు సంబంధం లేని విషయమని, ఇందులో వేలు పెట్టొద్దని అన్నారు. తాను ఎవరి జీవితంలోనూ తలదూర్చడం లేదని... మీరు కూడా మీ పని చేసుకుంటే మంచిదని వనిత సీరియస్ గా చెప్పింది. 
Vanitah Vijayakumar
Marriage
Lakshmi Ramakrishnan
Kollywood

More Telugu News