Andhra Pradesh: మాస్క్ పెట్టుకోమన్నందుకు.. నెల్లూరులో మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి కొట్టిన అధికారి.. వీడియో ఇదిగో!

An employee of a hotel in Nellore under Andhra Pradesh Tourism Department beat up a woman colleague
  • భాస్కర్ మాస్క్ పెట్టుకోలేదని గుర్తించిన ఉద్యోగిని
  • ఆగ్రహంతో ఊగిపోయిన డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌
  • పోలీసులకు ఉద్యోగుల ఫిర్యాదు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌ ధరించాలని చెప్పిన కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగిని ఓ అధికారి దారుణంగా కొట్టిన ఘటన నెల్లూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ టూరిజం హోటల్‌లో చోటు చేసుకుంది. ఉద్యోగిని ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది.

అక్కడి ఉద్యోగులంతా మాస్కులు ధరించారని, భాస్కర్ మాత్రం ధరించలేదని గుర్తించి ఆమె ఆయనను ప్రశ్నించడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. దాడి చేస్తోన్న సమయంలో అక్కడున్న  ఇతర ఉద్యోగులు భాస్కర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

చివరకు ఆమెను అతడి బారి నుంచి కాపాడారు. బాధితురాలితో కలిసి ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Nellore District
Crime News
Viral Videos

More Telugu News