Hong Kong: హాంకాంగ్ భద్రతా చ‌ట్టానికి ఆమోదం తెలిపిన చైనా

China passes controversial Hong Kong security law
  • ఆమోదం తెలిపిన చైనా ప్ర‌తినిధుల స‌భ
  • హాంకాంగ్‌లో నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ఆమోదం
  • చైనా ప‌ట్ల హాం‌కాంగ్‌లో వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు జ‌రిగితే ఇకపై శిక్ష
అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ వివాదాస్పద హాంకాంగ్ భ‌ద్ర‌తా చ‌ట్టానికి చైనా ఆమోద ముద్ర వేసింది. చైనా ప్ర‌తినిధుల స‌భ ఈ చ‌ట్టానికి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టంపై హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నప్పటికీ చైనా దీనికి ఆమోదం తెలపడం గమనార్హం.

చైనా ప‌ట్ల హాం‌కాంగ్‌లో ఎలాంటి వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు జ‌రిగినా ఈ చ‌ట్టం ద్వారా క‌ఠినంగా శిక్షించ‌వచ్చు. ఈ చట్టంపై హాంకాంగ్‌ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాం‌కాంగ్ సిటీ గుర్తింపుకు ప్ర‌మాదం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాం‌కాంగ్ త‌న న్యాయ‌ స్వేచ్ఛ‌ను కోల్పోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

కాగా, 1997 వరకు హాంకాంగ్‌ బ్రిటిష్ అధీనంలో ఉంది. అనంతరం అది చైనా చేతిలోకి వెళ్లింది. హాంకాంగ్‌లో వేర్పాటు వాదం, విదేశీ జోక్యాన్ని నివారిస్తామంటూ చైనా అక్కడి ప్రజల అన్ని రకాల స్వేచ్ఛలనూ హరించే విధంగా భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని, ఆదేశాలను ధిక్కరించినవారిని శిక్షించనున్నారు.
Hong Kong
China

More Telugu News