దేశంలో కరోనాతో ఒక్కరోజులో 418 మంది మృతి
- గత 24 గంటల్లో 18,522 మందికి కొత్తగా కరోనా
- కరోనా కేసుల సంఖ్య మొత్తం 5,66,840
- మృతుల సంఖ్య మొత్తం 16,893
- నిన్నటి వరకు మొత్తం 86,08,654 శాంపిళ్ల పరీక్ష
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,66,840కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,893కి పెరిగింది. 2,15,125 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,34,822 మంది కోలుకున్నారు.
కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 86,08,654 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,10,292 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.