Visakhapatnam District: పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై ఆరా తీసిన వైఎస్ జగన్.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

YS Jagan Asks about Parawada gas leak incident
  • పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో గ్యాస్ లీక్
  • ఇద్దరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
  • కంపెనీని మూసివేయించిన కలెక్టర్
విశాఖపట్టణం, పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీలు ముందు జాగ్రత్త చర్యగా పరిశ్రమను మూసివేయించారు. గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు.  
Visakhapatnam District
Parawada
sainor life sciences
Jagan

More Telugu News