నాకేమీ కాలేదు... మైసూరులో ఆరోగ్యంగానే ఉన్నా: ఎస్.జానకి
- ఎస్.జానకి ఇకలేరంటూ ప్రచారం
- తాను క్షేమంగా ఉన్నానంటూ ఎస్.జానకి ఆడియో సందేశం
- అభిమానులు ఫోన్ చేసి ఏడుస్తున్నారని వెల్లడి
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో అభిమానులు ఫోన్ చేసి విలపిస్తున్నారని, వాళ్లను ఓదార్చడంతోనే తనకు సరిపోతోందని అన్నారు. ఈ మేరకు ఎస్.జానకి ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. హైదరాబాదులో కరోనా ఎక్కువగా ఉందంటున్నారని, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.