Perni Nani: ప్రధాన అనుచరుడి హత్య.. మృతదేహం వద్ద విలపించిన మంత్రి పేర్ని నాని

Perni Nani gets emotional by seeing his follower Moka Nageswar Rao deadbody
  • మచిలీపట్నంలో మోకా భాస్కరరావు హత్య
  • హుటాహుటిన అక్కడకు చేరుకున్న పేర్ని నాని
  • భాస్కరరావు కుటుంబసభ్యులను ఓదార్చిన మంత్రి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. హత్యకు గురైన భాస్కరరావు ఏపీ మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కత్తితో పొడిచి చంపారు. ఈ హత్యతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి.

భాస్కరరావు హత్య వార్తను విన్న వెంటనే పేర్ని నాని హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురై, విలపించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Perni Nani
YSRCP
Moka Nageswar Rao
Murder

More Telugu News