KTR: తన రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు

KTR is dynamic leader praises Uttam Kumar Reddy
  • హుజూరాబాద్ లో ఒకే కార్యక్రమానికి హాజరైన ఇద్దరు నేతలు
  • కేటీఆర్ డైనమిక్ లీడర్ అంటూ ఉత్తమ్ ప్రశంస
  • పీసీసీ అధ్యక్షుడిగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న ఉత్తమ్ కు కేటీఆర్ అభినందన
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ ఉప్పూ, నిప్పులా ఉంటారు. ఇద్దరి మధ్య రాజకీయపరమైన మాటల తూటాలు పేలుతుంటాయి. నీవు ఒకటంటే... నేను రెండు అంటా అనే విధంగా వీరిద్దరూ విమర్శనాస్త్రాలను సంధించుకుంటూ ఉంటారు. అయితే, ఈరోజు ఇద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఇద్దరూ సరదాగా గడిపారు. హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. మరోవైపు కేటీఆర్ పై ఉత్తమ్ ప్రశంసలు కురిపించారు. కేటీఆర్ డైనమిక్ లీడర్ అంటూ కితాబునిచ్చారు. ఈ ఊహించని పరిణామాలతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఉత్తమ్ ప్రశంసలతో ఆ ప్రాంతం చప్పట్లతో మారుమోగింది.
KTR
TRS
Uttam Kumar Reddy
Congress

More Telugu News