Gadde Rammohan: ఆ ఇళ్లనే ఇవ్వలేని జగన్ సర్కారు.. 25 లక్షల ఇళ్లను ఎలా ఇస్తుంది?: గద్దె రామ్మోహన్

How can YSRCP give 25 lakh houses asks Gadde Rammohan
  • టీడీపీ హయాంలో కట్టిన వాటినే ఇవ్వలేకపోతోంది
  • అప్పట్లో ఇళ్ల కోసం జనాలు రూ. 25 వేలు కట్టారు
  • ఇప్పుడు మరో 75 వేలు కట్టాలని అధికారులు ఫోన్లు చేస్తున్నారు
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం ఎవరీకి ఇవ్వడం లేదని విమర్శించారు. చాలా మంది ఇళ్ల కోసం అప్పట్లో రూ. 25 వేలు కట్టారని... చిన్నచిన్న పనులు పూర్తి చేసి, ఆ ఇళ్లను ఇవ్వొచ్చని... కానీ, జగన్ సర్కారు ఆ మాత్రం చిన్న పనిని కూడా చేయలేకపోతోందని అన్నారు. ఈ ఇళ్లనే ఇవ్వలేని ప్రభుత్వం... 25 లక్షల ఇళ్లను ఎలా ఇస్తుందని ఎద్దేవా చేశారు.

టీడీపీ హయాంలో రూ. 25 వేలు కట్టినవారు ఇప్పుడు మరో రూ. 75 వేలు కడితే ఇల్లు ఇస్తామని చెపుతున్నారని... ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ. 75 వేలు కట్టాలంటూ విజయవాడలో చాలా మందికి అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఈరోజు ఆయన మరో టీడీపీ నేత నాగుల్ మీరాతో కలిసి టిడ్కో ఎండీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Gadde Rammohan
Telugudesam
Houses

More Telugu News