Viral Videos: కారులోంచి దిగొచ్చి పోలీసును తన్నిన డీఎంకే మాజీ ఎంపీ.. వీడియో ఇదిగో

Former MP K Arjunan hits a police personnel on duty near Salem check post
  • తమిళనాడులోని సేలంలో ఘటన
  • చెక్‌పోస్ట్  వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసులు
  • అర్జునన్‌ వెళ్తున్న కారును ఆపి ఈ-పాస్ అడగడంతో గొడవ 
తమిళనాడులోని సేలంలో ఓ పోలీసు అధికారిని మాజీ ఎంపీ, డీఎంకే నేత కె.అర్జునన్ కాలితో తన్ని రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. కొవిడ్‌-19 వ్యాప్తి కట్టడిలో భాగంగా అక్కడి చెక్‌పోస్ట్  వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసులు.. అర్జునన్‌ వెళ్తున్న వాహనాన్ని ఆపి ఈ-పాస్ చూపించాలని అడిగారు.

దీంతో ఆ మాజీ ఎంపీకి చిర్రెత్తుకొచ్చింది. నన్నే ఆపుతావా? అంటూ పోలీసులతో గొడవకు దిగారు. పరుష పదజాలంతో దూషిస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగి తిరిగి వెళ్లి కారులో కూర్చుకున్నారు. అయితే, ఆగ్రహం తగ్గకపోవడంతో మళ్లీ కారు దిగి దూసుకొచ్చి, దాడి చేశారు. కొంత మంది వారి మధ్య జరుగుతున్న ఘర్షణను అడ్డుకున్నారు.
Viral Videos
Tamilnadu
Lockdown

More Telugu News