Pakistan: పాకిస్థాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రదాడి!

  • కారులో దాడికి వచ్చిన నలుగురు
  • తుపాకులు, గ్రనేడ్లతో దాడి
  • ఎన్ కౌంటర్ లో అందరూ హతం
Terror Attack on Karachi Stock Exchange

ఈ ఉదయం పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజ్ పై జరిగిన ఉగ్రదాడి కలకలం రేపింది. తుపాకి, గ్రనేడ్లతో వచ్చిన ఓ వ్యక్తి, బిల్డింగ్ లోకి ప్రవేశించి, దాడికి దిగాడు. అతనితో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా దాడికి రాగా, నలుగురినీ హతమార్చామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ భవంతి హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉందని, చాలా బ్యాంకుల ప్రధాన శాఖలు ఇక్కడే ఉన్నాయని అన్నారు.

"సిల్వర్ కలర్ లో ఉన్న కరోలా కారులో వారు వచ్చారు. దాడికి పాల్పడిన నలుగురినీ ఎన్ కౌంటర్ లో కాల్చిచంపాం" అని కరాచీ పోలీస్ చీఫ్ గులాం నబీ మీనన్ వెల్లడించారు. ఈ ఘటనలో సాధారణ పౌరులు, స్టాక్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తున్న ఉద్యోగులగు ఏమైనా జరిగిందా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

More Telugu News