Md Mahamood Ali: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా నిర్ధారణ.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

mahamood ali tests positive for corona
  • ఆయనతో కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి క్వారంటైన్
  • హోంమంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ 
  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో మహమూద్ అలీ
  • 3 రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు  
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా సోకింది. ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హోంమంత్రితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు‌.

ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో మునిసిపల్ సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు మంత్రులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా, కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న మహమూద్ అలీ మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.

ఆయనకు ఆస్తమా వ్యాధి ఉండటంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచే ఆయనను అపోలోకు తరలించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇటీవల జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ ‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌కి కరోనా సోకింది. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.
Md Mahamood Ali
TRS
Corona Virus

More Telugu News