Thota Trimurthulu: శ్వేతపత్రం గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు కాపు జాతి గురించి తెలుసా?: తోట త్రిమూర్తులు

Thota Trimuthulu fires on Pawan Kalyan on Kapu issue
  • కాపుల అంశంపై ఏపీ రాజకీయాల్లో రగడ
  • వైసీపీ సర్కారుపై పవన్ విమర్శలు
  • బదులిచ్చిన తోట త్రిమూర్తులు
ఏపీ రాజకీయాల్లో కాపుల అంశం అధికంగా ప్రస్తావనకు వస్తోంది. సీఎం జగన్ కాపు నేస్తం పథకం తీసుకువచ్చిన నేపథ్యంలో, విపక్షాలన్నింటిలోనూ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ దీనిపై తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఇప్పటికు పలు దఫాలు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

దీనిపై వైసీపీ నేత తోట త్రిమూర్తులు స్పందించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన మోసాలపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు ఏంచెబితే పవన్ అదే చేశారని ఆరోపించారు. కాపుల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు కాపు జాతి గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. కాపులు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న భీమవరం, గాజువాకలోనే పవన్ కల్యాణ్ ఓటమిపాలయ్యారని, ఇప్పటికైనా పవన్ తన లోపాలు గుర్తెరిగి సరిచేసుకోవాలని హితవు పలికారు.
Thota Trimurthulu
Pawan Kalyan
Kapu
YSRCP
Chandrababu
Andhra Pradesh

More Telugu News