yashwant sinha: మళ్లీ రాజకీయాల్లోకి యశ్వంత్ సిన్హా.. కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటన

Yashwant Sinha Announces New Front To Contest Bihar Assembly Polls
  • త్వరలోనే పార్టీ పేరు ప్రకటన
  • మోదీ, నితీశ్ ప్రభుత్వాలను గద్దె దింపడమే లక్ష్యం
  • బెటర్ బీహార్ నినాదంతో ప్రజల్లోకి
సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తిరిగి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. బీజేపీ నుంచి తప్పుకుని గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సిన్హా.. నూతన పార్టీతో తిరిగి కాలుమోపబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ‘బెటర్ బీహార్’ లక్ష్యంగా పార్టీని స్థాపిస్తున్నట్టు పేర్కొన్న ఆయన త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానన్నారు. మోదీ సారథ్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

తమతో కలిసి వచ్చేందుకు సిద్ధపడే వారిని సాదరంగా ఆహ్వానిస్తామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు. తమకు ఎలాంటి రిజర్వేషన్లు లేవని, బెటర్ బీహార్ కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత బీద పరిస్థితికి ఆయనే కారణమన్నారు. మెరుగైన బీహార్ కోసం నితీశ్ సర్కారును కూడా గద్దె దింపుతామని సిన్హా పేర్కొన్నారు.
yashwant sinha
Better Bihar
New Front
Assembly Polls

More Telugu News