మీ స్ఫూర్తి మమ్మల్ని గర్వించేలా చేసింది: పీటీ ఉషకు యువరాజ్ శుభాకాంక్షలు
- నేడు పీటీ ఉష జన్మదినం
- 56వ వసంతంలోకి అడుగుపెట్టిన పరుగుల రాణి
- మీ విజయాలను చూస్తూ పెరిగామన్న యువీ
ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పరుగుల రాణిగా ప్రశంసలు అందుకున్న ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని యువీ ట్వీట్ చేశాడు. మీ అద్బుతమైన విజయాలు, పట్టుదలను చూస్తూ పెరిగామని... మీ స్ఫూర్తి మమ్మల్ని భారతీయులుగా గర్వించేలా చేసిందని చెప్పాడు. యువతను ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న కృషి చాలా గొప్పదని కితాబిచ్చాడు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించాడు.