Kadapa District: కడప జిల్లాలో కారును ఢీకొన్న రైలింజన్.. ఒకరి మృతి

Rail engines drags car for 200 m in Kadapa Dist
  • ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు వద్ద ప్రమాదం
  • ట్రాక్ పై ఆగిపోయిన కారు
  • కారును 200 మీటర్లు లాక్కెళ్లిన రైలింజన్
కడప జిల్లాలో కారును రైలింజన్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే, ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు దాటిన తర్వాత భారతీ సిమెంట్స్ కు వెళ్లే రైల్వే ట్రాక్ లెవెల్ క్రాసింగ్-3 వద్ద కారు రైల్వే లైనును దాటుతుండగా ట్రాక్ మీద ఆగిపోయింది. అదే సమయంలో ఓ రైలింజన్ వచ్చింది. కారును దాదాపు 200 మీటర్లు లాక్కెళ్ళింది. ఆ సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ప్రొద్దుటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో రైలింజన్ 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
Kadapa District
Train Accident

More Telugu News