Bandla Ganesh: పెద్ద మనసుతో క్షమించండి: బండ్ల గణేష్

If I hurt you please forgive me says Bandla Ganesh
  • తెలిసో తెలియకో బాధ పెట్టి ఉంటే క్షమించండన్న గణేశ్
  • విద్వేషం వద్దంటూ టాటా చేసిన వ్యాఖ్యలను షేర్ చేసిన వైనం
  • గణేశన్న మనను వెన్న అంటూ అభిమానుల స్పందన
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత, బండ్ల గణేశ్ స్టైలే వేరు. మనసుకు ఏదైనా అనిపించినప్పుడు వెంటనే ఒక మాట అనేయడం... ఆ తర్వాత అంతే వేగంగా క్షమాపణ చెప్పడం కూడా ఆయన నైజం. తాజాగా ట్విట్టర్ ద్వారా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మా గణేశన్న మనసు వెన్న అంటూ ఆ ట్వీట్ పట్ల ఆయన అభిమానులు స్పందిస్తున్నారు. 'తెలిసో తెలియకో నేను ఎవరినైనా బాధ పెట్టినా, తప్పు చేసినా, పెద్ద మనసుతో క్షమించండి' అని బండ్ల గణేశ్ కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.

'ఈ ఏడాది అందరూ సమస్యల్లో మునిగి ఉన్నారు. కొందరు ఆన్ లైన్ లో ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీస్తున్నారు. అందరూ కలిసి అభివృద్ధి సాధించాల్సిన ఈ క్లిష్ట సమయంలో విద్వేషాన్ని పెంచే ధోరణి సరికాదు. ఓపిక, దయ, అర్థం చేసుకునే  తత్వాన్ని మరింత పెంచుకుంటూ ముందుకెళ్దాం' అంటూ రతన్ టాటా చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు.
Bandla Ganesh
Tollywood

More Telugu News