China: భారత సరిహద్దులోకి చైనా సైన్యం చొచ్చుకొస్తోంది: అమెరికా సెనేటర్

China used coronavirus to lash out in every direction says US Senator
  • కరోనా వ్యాప్తిని అదునుగా చేసుకుని డ్రాగన్‌ చర్యలు
  • పొరుగు దేశాలను దెబ్బకొట్టేందుకు పథకం
  • బేస్‌బాల్ బ్యాట్లకు మేకులు కొట్టి భారత ఆర్మీపై దాడి  
  • దక్షిణ చైనా సముద్రంలోనూ చైనా కవ్వింపు చర్యలు
పొరుగు దేశాలపై చైనా పాల్పడుతోన్న దుశ్చర్యలపై అమెరికా సెనేటర్, సెనేట్ సాయుధ సేవల కమిటీ చైర్మన్ జిమ్ ఇన్హోఫ్ పలు విషయాలు తెలిపారు. చైనాతో పాటు రష్యాకు గట్టిగా సందేశం పంపేందుకు అమెరికా జాతీయ రక్షణ అధికార చట్టానికి మద్దతు కోసం సెనేట్‌ సభలో ఆయన ప్రసంగించారు.

కరోనా వ్యాప్తిని అదునుగా చేసుకుని డ్రాగన్‌ దేశం పొరుగు దేశాలను దెబ్బకొట్టేందుకు పథకం రచించిందని జిమ్ ఇన్హోఫ్  చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలోనూ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. ఈ చర్యల ద్వారా తైవాన్, మలేషియా, వియత్నాం, ఇండోనేసియా వంటి దేశాలపై వేధింపులకు దిగుతోందని వివరించారు.

ముందస్తు వ్యూహం ప్రకారమే భారత సరిహద్దులోకి డ్రాగన్ దేశ సైన్యం చొచ్చుకొస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే భారత ఆర్మీకి చెందిన 20 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ ఘర్షణ సమయంలో చైనా ఆర్మీ బేస్‌బాల్ బ్యాట్లకు మేకులు కొట్టి దాడికి పాల్పడందని చెప్పారు.
China
India
america

More Telugu News