Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో నమోదైన కేసులు.. నిన్న ఒక్కరోజే 920 కేసులు వెలుగులోకి

920 Corona Cases Recorded in Telangana yesterday
  • జీహెచ్ఎంసీ పరిధిలో 737 కేసుల నమోదు
  • 11,364కి పెరిగిన రాష్ట్రంలోని కేసుల సంఖ్య
  • ఇప్పటి వరకు 230 మంది మృతి
తెలంగాణలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతి రోజూ కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో 920 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 11,364కి చేరింది. వీరిలో 4,688 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 6,446 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. నిన్న కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 230కి పెరిగింది.

నిన్న నమోదైన కొత్త కేసుల్లో 737 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌‌లో 60, కరీంనగర్‌‌లో 13, సిరిసిల్లలో 4, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మూడేసి, ములుగు, వరంగల్‌ అర్బన్, మెదక్‌ జిల్లాల్లో రెండేసి, వరంగల్‌ రూరల్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 70,934 మందికి పరీక్షలు నిర్వహించగా, 59,570 మందికి నెగిటివ్ వచ్చినట్టు‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
.
Telangana
Corona Virus
GHMC

More Telugu News