Alia Bhatt: విమర్శకులపై మండిపడ్డ అలియా భట్ తల్లి 

Only talented people can succeed in industry says Alia Bhatt mother
  • బాలీవుడ్ లో నెపోటిజంపై విమర్శలు
  • విమర్శిస్తున్న వారు ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి వస్తుందన్న అలియా తల్లి
  • స్టార్ కిడ్స్ అంతా సక్సెస్ కాలేరని వ్యాఖ్య
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో నెలకొన్న స్టార్ వారసత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులే కాకుండా బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దీనిపై విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ లోని మూడు కుటుంబాలు ఇతరులను ఎదగనివ్వడం లేదని మండిపడుతున్నారు. ఇదే సమయంలో అలియాభట్ వంటి స్టార్ కిడ్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టాలెంట్ లేకపోయినా... బ్యాక్ గ్రౌండ్ తో నెట్టుకొస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ స్పందించారు. తన కుమార్తెను విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు. నెపోటిజం పేరుతో ఈ రోజు విమర్శలు గుప్పిస్తున్న వారంతా ఏదో ఒక రోజు వారి వారసుల గురించి సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. ఇండస్ట్రీలోకి వస్తామని వారి పిల్లలు కూడా అడిగితే... వారు ఏం చేస్తారని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలోకి రాకుండా ఆపుతారా? అని ప్రశ్నించారు. స్టార్ కిడ్స్ గా ప్రవేశించిన వారంతా సక్సెస్ కాలేరని... కేవలం టాలెంట్ ఉన్నవారు మాత్రమే నిలదొక్కుకుంటారని ఆమె చెప్పారు.
Alia Bhatt
Mother
Nepotism

More Telugu News