Imran Khan: లాడెన్ ను చంపిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం: ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Imran Khan praises Bin Laden
  • అమెరికాకు లాడెన్ సమాచారాన్ని మేమే ఇచ్చాం
  • చంపడానికి ఆపరేషన్ చేపట్టకూడదని కూడా చెప్పాం
  • లాడెన్ ను చంపిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ ఉగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ను అమర వీరుడని ప్రశంసించారు. అమెరికా బలగాలు అబోటాబాద్ వచ్చి లాడెన్ ను చంపినప్పుడు తాము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు. బిన్ లాడెన్ ను ఇమ్రాన్ ఖాన్ పొగడటం ఇదే మొదటి సారి కాదు. ప్రధాని కాకముందు ఓ టీవీ చానల్ తో ఆయన మాట్లాడుతూ, లాడెన్ ను ఉగ్రవాది అంటే తాను ఒప్పుకోనని అన్నారు. కేవలం బ్రిటన్ కు మాత్రమే ఆయన ఉగ్రవాది అని... మిగతావారికి  ఆయన స్వాతంత్ర్య సమరయోధుడని చెప్పారు. అమెరికాకు లాడెన్ దాక్కున్న ప్రదేశం వివరాలను తామే ఇచ్చామని... అయితే చంపేందుకు ఆపరేషన్ చేపట్టకూడదని కూడా చెప్పామని అన్నారు. అయినా, లాడెన్ ను అమెరికా చంపేసిందని... అప్పుడు చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు.
Imran Khan
Pakistan
Bin Laden

More Telugu News