Ravishankar Prasad: కాంగ్రెస్ పార్టీ చైనా నిధులతో నడుస్తోంది: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు

Union Minister Ravishankar Prasad alleges Congress party runs on China funds
  • రాజీవ్ ట్రస్టుకు చైనా ఎంబసీ నిధులు వస్తున్నాయని వెల్లడి
  • అందుకే కాంగ్రెస్ పార్టీ చైనాకు వత్తాసు పలుకుతోందని ఆరోపణ
  • సరిహద్దు ఘర్షణలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ నాయకులు ఘాటు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ ఎదురుదాడికి దిగారు. చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని అన్నారు. రాజీవ్ ట్రస్టుకు చైనా దౌత్య కార్యాలయం నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చైనాకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.

అంతకుముందు, గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, చైనా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదన్నారు. దురాక్రమణలకు పాల్పడకపోతే ఇంతమంది భారత సైనికులు ఎలా చనిపోయారు? వారు చనిపోయింది ఎవరి భూభాగంలో? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది.
Ravishankar Prasad
Congress
China
Funds
Galwan Valley
Narendra Modi
BJP
India

More Telugu News