Cashier: రోజూ 100 మందికి జీతాలు చెల్లించిన క్యాషియర్ కు కరోనా... జీహెచ్ఎంసీ ఆఫీసులో కలకలం

Cashier tested corona positive in GHMC Head Office
  • తెలంగాణలో కరోనా విజృంభణ
  • ఎస్ బీఐ బ్రాంచ్ క్యాషియర్ కు కరోనా పాజిటివ్
  • జీహెచ్ఎంసీ కార్యాలయంలో 32కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
తెలంగాణలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతోంది. ఏకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కరోనా విజృంభిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ కార్యాలయంలోని ఎస్ బీఐ బ్రాంచ్ క్యాషియర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా బాధితుల సంఖ్య 32కి పెరిగింది. ఆ క్యాషియర్ రోజూ 100 మందికి చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. ఇప్పుడు వాళ్లందరి ఆరోగ్య పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటగా, వాటిలో సగానికి పైగా కేసులు హైదరాబాద్ పరిధిలోనే గుర్తించారు.
Cashier
SBI
GHMC
Head Office
Corona Virus
Positive
Hyderabad
Telangana

More Telugu News