bellamkonda srinivas: కొత్త లుక్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. వైరల్ అవుతోన్న ఫొటోలు

bellamkonda srinivas new look
  • న్యూ లుక్‌తో చాలా స్టైలిష్‌గా కనపడుతున్న బెల్లంకొండ
  • రేంజ్ రోవర్ కారు ముందు నిలబడి ఫొటోలు
  • గుర్తు పట్టలేనంతగా మారిపోయారంటోన్న నెటిజన్లు 
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోల్లో న్యూ లుక్‌తో తను చాలా స్టైలిష్‌గా కనపడుతున్నాడు. రేంజ్ రోవర్ కారు ముందు నిలబడి ఆయన ఫొటోలకు పోజులిచ్చాడు. కరోనా వైరస్ విజృంభణతో విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంటివద్దే ఉంటోన్న సినీనటులు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు.
                 
బెల్లంకొండ శ్రీనివాస్‌ కూడా సామాజిక మాధ్యమాలను బాగానే వాడేకుంటున్నాడు. ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుర్తు పట్టలేనంతగా ఆయన మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'అల్లుడు అదుర్స్' అనే సినిమాలో నటిస్తున్నాడు.
         
bellamkonda srinivas
Viral Pics
Tollywood

More Telugu News