Prakasam District: ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. దగ్ధమైన బోగీలు

Goods train accident in prakasam dist
  • విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్సు రైలు
  • ట్రాక్ కుంగిపోయి విడిపోయిన బోగీలు
  • రూ. 80 లక్షల నష్టం
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో గత అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్సు రైలు నాయుడుపాలెం-బాపూజీనగర్ మధ్య సూరారెడ్డి పాలెం వద్ద వంతెన దాటుతుండగా ట్రాక్ కుంగిపోయి చివరన ఉన్న బోగీలు విడిపోయాయి. ఆ వెంటనే మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పట్టాలు తప్పిన బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే, 200 మీటర్ల మేర ట్రాక్ ధ్వంసమైంది.  ప్రమాదంలో రూ. 80 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ట్రాక్ కుంగిపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు.
Prakasam District
Train Accident
Diesel tankers

More Telugu News