Guntur District: తెనాలిలో టీడీపీ నేత మంచాల రమేశ్‌పై హత్యాయత్నం

ruckus in guntur
  • 39వ వార్డులో కౌన్సిలర్‌గా రమేశ్ కుమార్తె పోటీ
  • ఈ నేపథ్యంలో రమేశ్‌తో పాటు ఆయన సోదరుడిపై దాడి
  • ఐతానగర్‌లోని రమేశ్‌ ఇంటి వద్ద ఘటన
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఈ రోజు ఉదయం కలకలం చెలరేగింది. ఆ పట్టణంలోని 39వ వార్డులో కౌన్సిలర్‌గా టీడీపీ నేత మంచాల రమేశ్ కుమార్తె పోటీ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో రమేశ్‌తో పాటు ఆయన సోదరుడిపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు.

ఐతానగర్‌లోని ఆయన ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బయటకు పిలిచారు. అనంతరం దాడికి పాల్పడగా, వారిని అడ్డుకునేందుకు రమేశ్‌‌ సోదరుడు సతీశ్ ప్రయత్నించారు. దీంతో ఆయన‌ మెడపై గుర్తు తెలియన వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ హత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guntur District
Crime News
Telugudesam

More Telugu News