Covifor: కరోనా డ్రగ్ 'కోవిఫర్' ధరను ప్రకటించిన హెటిరో!

100 Mg Vial of Covifor Priced 5400 Rupees
  • 100 మిల్లీగ్రామ్ వయల్ రూ. 5,400
  • 20 వేల డ్రగ్ వయల్స్ మార్కెట్లోకి
  • జిలీడ్ సైన్సెస్ తో ఒప్పందంతో కోవిఫర్ తయారీ
జిలీడ్ సైన్సెస్ తయారుచేసిన కరోనా ఔషధం 'కోవిఫర్'  జనరిక్ వర్షన్ ను తయారు చేసిన హైదరాబాద్ సంస్థ హెటిరో, దాని ధరను నిర్ణయించింది. 100 మిల్లీగ్రామ్ వయల్ 'కోవిఫర్' ధర రూ. 5,400 (71 డాలర్లు)గా నిర్ణయించామని సంస్థ పేర్కొంది. తక్షణమే 20 వేల డ్రగ్ వయల్స్ ను మార్కెట్లోకి విడుదల చేయనున్నామని సంస్థ ప్రకటించింది. కాగా, కరోనా వైరస్ విషయంలో హెటిరోతో పోటీ పడుతున్న మరో సంస్థ సిప్లా తమ కరోనా డ్రగ్ ధర రూ. 5 వేల లోపే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇండియాలో భారీ ఎత్తున ఔషధాలను తయారు చేసి అందిస్తున్న సంస్థలుగా పేరున్న సిప్లా, హెటిరోలు, కరోనా డ్రగ్ తయారీ నిమిత్తం జిలీడ్ సైన్సెస్ తో ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. జిలీడ్ సైన్సెస్ రెమిడీసివిర్ ను తయారు చేయగా, అదే కంపోజిషన్ తో హెటిరో, సిప్లాలు జనరిక్ వర్షన్ లను విడుదల చేశాయి. ఈ డ్రగ్ ను 127 మధ్య, అల్పాదాయ దేశాలకు ఎగుమతి చేయాలని కూడా ఇరు సంస్థలూ భావిస్తున్నాయి.
Covifor
Corona Virus
Hetero
Price

More Telugu News