PVP: హైదరాబాద్ భూవివాదంలో వైసీపీ నేత, సినీ నిర్మాత పీవీపీ

YSRCP leader PVP involved in Land Issue
  • బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని భూమి వివాదం
  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కైలాశ్ విక్రమ్
  • ఇరువురిని ప్రశ్నిస్తున్న పోలీసులు
విజయవాడ వైసీపీ నేత, టాలీవుడ్ నిర్మాత పీవీపీ భూ వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని భూమి విషయంలో పీవీపీ, అతని అనుచరులు తనపై దాడి చేశారంటూ కైలాశ్ విక్రమ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, భూమికి సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని పీవీపీ చెపుతున్నారు. ఈ నేపథ్యంలో పీవీపీని పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. భూ వివాదంపై ఇరువురిని ప్రశ్నిస్తున్నారు. వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
PVP
Tollywood
YSRCP
Land Dispute

More Telugu News