Telangana: కుటుంబ సభ్యులందరికీ కరోనా.. మనోవేదనతో కన్నుమూసిన తల్లి

mother died due to her family infected to corona virus
  • ఆమనగల్లులో ఘటన
  • కుమారుడు, కోడలు, మనవడికి కరోనా
  • నిత్యం అదే పనిగా ఆలోచిస్తూ గుండెపోటుతో తల్లి మృతి
కుటుంబ సభ్యులందరూ వరుసగా కరోనా బారినపడుతుండడంతో మనస్తాపానికి గురైన ఓ తల్లి గుండెపోటుకు గురై కన్నుమూసింది. తెలంగాణలోని ఆమనగల్లులో జరిగిందీ ఘటన.  పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌ కర్నూలు జిల్లాలోని బైరాపూర్‌కు చెందిన వ్యక్తి కుటుంబంతో కలిసి ఆమనగల్లులో నివసిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడు మరణించడంతో కుమారులతో కలిసి భార్య (60) అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో రెండు వారాల క్రితం ఆమె రెండో కుమారుడు, కోడలు, మనవడు కరోనా బారినపడ్డారు. దీంతో వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స అనంతరం ఆమనగల్లు పంపారు. అప్పటి నుంచి వారు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. కుటుంబంలోని ముగ్గురు కరోనా బారినపడి హోం క్వారంటైన్‌లో ఉండడంతో మనస్తాపానికి గురైన తల్లి నిత్యం అదే పనిగా ఆలోచిస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది.  
Telangana
Amangal
Corona Virus
died

More Telugu News