Rajasthan: పరిశుభ్రమైన దొంగతనం... శానిటైజ్ చేసుకుని మరీ చోరీ!

Thiefs Sanitise their Hands before Theft
  • రాజస్థాన్ లోని దౌల్ పూర్ లో ఘటన
  • దుకాణాల్లోకి చొరబడి తొలుత విందు
  • దొంగల కోసం పోలీసుల గాలింపు
వారంతా దొంగలు. దొంగతనానికి వచ్చి చేతులను శానిటైజ్ చేసుకుని మరీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లోని దౌల్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి రెండు దుకాణాల్లోకి వెనుకవైపు నుంచి చొరబడిన దొంగలు తొలుత అక్కడున్న ఆహార పదార్ధాలను లాగించారు.

ఆ తరువాత చేతులు శానిటైజర్ తో పరిశుభ్రపరచుకున్నారు. తమకు కనిపించిన రూ. ఐదు వేలకు పైగా నగదు, లక్ష రూపాయల విలువైన వస్తువులను చోరీ చేశారు. రెండు కిరాణా దుకాణాల్లో ఇలాగే చేశారు. ఉదయం దుకాణం యజమానులు తలుపు తీసిన తరువాత చోరీ జరిగిందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసి, దొంగల కోసం గాలిస్తున్నారు.
Rajasthan
Sanitise
Theft
Police

More Telugu News