Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ కు కరోనా... భార్యకు కూడా పాజిటివ్

Tennis great Novak Djokovic tested corona positive
  • ఇటీవలే ఓ ఎగ్జిబిషన్ టోర్నీ ఆడిన జకోవిచ్
  • ఇప్పటికే దిమిత్రోవ్, కోరిచ్ వంటి ఆటగాళ్లకు కరోనా
  • టోర్నీలో ఆడిన ప్రతి ఆటగాడికి కరోనా టెస్టులు చేయాలని నిర్ణయం
కరోనా మహమ్మారి క్రీడా ప్రపంచంపైనా ప్రభావం చూపుతోంది. తాజాగా టెన్నిస్ గ్రేట్ నొవాక్ జకోవిచ్ కూడా కరోనా బారినపడ్డాడు. జకోవిచ్ మాత్రమే కాదు భార్య జెలెనాకు సైతం కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల జకోవిచ్ సహా పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఓ ఎగ్జిబిషన్ టోర్నీని నిర్వహించారు.

ఈ టోర్నీలో ఆడిన గ్రిగోర్ దిమిత్రోవ్, బోర్నా కోరిచ్ కు ఇంతకుముందే కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ టోర్నీలో ఆడిన ప్రతి ఆటగాడికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆర్గనైజర్లు నిర్ణయించారు. ఈ క్రమంలో బెల్ గ్రేడ్ చేరుకున్న జకోవిచ్ కు, అతని కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, జకోవిచ్ కు, భార్య జెలెనాకు పాజిటివ్ అని తేలింది. అయితే, వారి పిల్లలకు నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది. జకోవిచ్ కు పాజిటివ్ వచ్చినా, ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.
Novak Djokovic
Corona Virus
Jelena
Positive
Exibition Tourney

More Telugu News