Salman Khan: సల్మాన్ ఖాన్‌ది విషపూరిత స్వభావం: గాయని సోనా తీవ్ర వ్యాఖ్యలు
- సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో వ్యాఖ్యలు
- అభిమానులందరూ సుశాంత్ ఫ్యాన్స్‌కు అండగా నిలవాలన్న సల్మాన్
- విమర్శించిన సోనా
- గతంలో సల్మాన్ పెయిడ్ ఆర్మీ ఇతరులను బెదిరించారని వ్యాఖ్య
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై గాయని సోనా మహాపాత్ర విరుచుకుపడింది. ఆయనది విషపూరిత స్వభావమని తెలిపింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇటీవల సల్మాన్ ఖాన్ స్పందిస్తూ అభిమానులందరూ సుశాంత్ ఫ్యాన్స్‌కు అండగా నిలవాలని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే, ఆయన వ్యాఖ్యలపై సోనా స్పందిస్తూ... విషపూరిత స్వభావం, పెద్ద మనసు కలిగిన ఓ వ్యక్తి నుంచి కదలిక వచ్చిందని విమర్శించింది. సల్మాన్ డిజిటల్ పెయిడ్ ఆర్మీ గతంలో ఇతరులను బెదిరించారని, ఆ సమయంలో వాటిపై ఆయన స్పందించలేదని, క్షమాపణ చెప్పడం కూడా అవసరమని ఆయన భావించలేదని ఆమె తెలిపింది.