Aamir Khan: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఫొటో చూసి ఆశ్చర్యపోతోన్న నెటిజన్లు!

aamir khan photo goes viral
  • గుర్తు పట్టలేకపోతున్నామంటూ కామెంట్లు
  • తెల్లని జుట్టుతో ఆమిర్
  • కూతురితో కలిసి ఫొటోకు పోజు
కొవిడ్‌-19 విజృంభణ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులు ఆగిపోవడంతో సినీనటులు ఇంట్లోనే ఉండడంతో వారి కొత్త లుక్‌లు ఇటీవల బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన తండ్రితో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమిర్ కనపడిన తీరు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తెల్లని జుట్టుతో, కళ్లజోడు పెట్టుకుని ఇందులో ఆమిర్ కనపడుతున్నాడు. ఆయనను గుర్తు పట్టలేకపోతున్నామంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన కూతురితో కలిసి ఫొటోకు ఆయన ఇచ్చిన పోజుకు అందరూ ఫిదా అయిపోతున్నారు.
Aamir Khan
Bollywood
Viral Pics

More Telugu News