అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. గంటా శ్రీనివాసరావు సన్నిహితుడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ
- మంత్రి అవంతి, విజయసాయి, ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
- మూడు రోజుల క్రితమే నోటీసులు
- నందిగామలో చిరుమామిళ్ల కృష్ణ అరెస్ట్
కిశోర్ అరెస్ట్‌పై గంటా శ్రీనివాసరావు స్పందించారు. అర్ధరాత్రి వేళ ఓ పెద్దాయనను ఇలా అదుపులోకి తీసుకోవడం సరికాదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టును ఆయన ఫార్వార్డ్ మాత్రమే చేశారని అన్నారు. మరోవైపు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.