PCB: పాక్ క్రికెట్ టీమ్ లో తీవ్ర కలకలం... హైదర్, రౌఫ్, షాదాబ్ లకు కరోనా!

3 Cricketers in Pakisthan Team Tests Positive
  • ఇంగ్లండ్ టూర్ కు ముందు పరీక్షలు
  • లక్షణాలు లేకుండానే శరీరంలో వైరస్
  • వెల్లడించిన పీసీబీ
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం చెలరేగింది. జట్టు సభ్యుల్లో ముగ్గురికి కరోనా సోకిందని పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) స్పష్టం చేసింది. కీలక ఆటగాళ్లయిన హైదర్ అలీ, హరిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్‌ లు మహమ్మారి వైరస్ బారిన పడ్డారని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

వాస్తవానికి వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని, అయినా ఇంగ్లండ్ తో పర్యటనకు ముందు వీరికి టెస్టులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి పరీక్షలు జరిపించామని అధికారులు తెలిపారు. ఆదివారం నాడు రావల్పిండిలో క్రికెటర్లందరి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపామని, ఆపై వీరు ముగ్గురికీ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకడంతో ఇతర క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది.
PCB
Pakistan
Corona Virus
Positive

More Telugu News