Nayanatara: డోంట్ వర్రీ.. దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్నే ఇచ్చాడు: నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్

Nayan and Vighnesh condemns news about corona virus
  • మాకు కరోనా వైరస్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం
  • మేము క్షేమంగానే ఉన్నాం
  • తప్పుడు వార్తలను సృష్టిస్తున్న జోకర్స్ 
ప్రముఖ సినీ నటి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ కరోనా వైరస్ బారిన పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. నిన్న ఈ వార్త విపరీతంగా షేర్ అయింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రేమ జంట స్పందించింది. తమకు వైరస్ సోకిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని విఘ్నేశ్ శివన్ తెలిపాడు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పాడు. ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్న జోకర్స్ ని, వాళ్లు పుట్టిస్తున్న జోక్స్ ను చూసి నవ్వుకోవడానికి దేవుడు తమకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడని ఇన్స్టాగ్రామ్ లో తెలిపాడు. మరోవైపు అంజలితో విఘ్నేశ్ శివన్ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నయన్ విషయానికి వస్తే... ప్రస్తుతం ఆమె రెండు చిత్రాల్లో నటిస్తోంది.
Nayanatara
Vighnesh Sivan
Bollywood
Corona Virus

More Telugu News