Kalyan Dev: చిరంజీవి చిన్నల్లుడి 'సూపర్ మచ్చి' ఆఖరి షెడ్యూల్ షురూ

Kalyan Dev new movie Super Machi final schedule started
  • కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పునఃప్రారంభం
  • సూపర్ మచ్చి చిత్రంలో కల్యాణ్ దేవ్ హీరో
  • పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
సుదీర్ఘ లాక్ డౌన్ ఇప్పుడిప్పుడే సడలిస్తున్న తరుణంలో టాలీవుడ్ చిత్రాలు ఒక్కొక్కటిగా షూటింగ్ బాట పడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న సూపర్ మచ్చి చిత్రం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ కూడా పునఃప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహిస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. సూపర్ మచ్చి చిత్రంలో కల్యాణ్ దేవ్ సరసన రచితా రామ్ హీరోయిన్ గా నటిస్తోంది. పులివాసు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిజ్వాన్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Kalyan Dev
Super Machi
Final Schedule
Lockdown
Corona Virus

More Telugu News