Police: ఢిల్లీలో ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం.. తనిఖీలు చేస్తోన్న పోలీసులు

Delhi Police on high alert after intelligence inputs about terror attack
  • నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తం
  • జమ్మూకశ్మీర్ నుంచి‌ ఐదుగురు ఉగ్రవాదులు వచ్చే అవకాశం
  • సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు
  • రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో సోదాలు
ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌ నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు జరుపుతున్నారని తాజాగా పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది.

ఈ క్రమంలో ఢిల్లీలో ఉగ్రవాదులు ప్రవేశించేందుకు వీలున్న అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతూ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ వైపుగా ఉండే అన్ని మార్గాల సరిహద్దుల్లో వాహనాలను కూడా తనిఖీలు చేపట్టారు. అలాగే, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వంటి అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ఢిల్లీ స్పెషల్ సెల్, క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Police
New Delhi

More Telugu News