Jakovich: జకోవిచ్ తో కలిసి ఆడిన దిమిత్రోవ్ కు కరోనా... టెన్నిస్ ప్రపంచంలో కలకలం!

Tennis Star Dimitrov Tests corona Positive
  • గత వారం ఆడ్రియా టూర్ లో పాల్గొన్న దిమిత్రోవ్
  • మొనాకోకు రాగానే అస్వస్థత
  • ఎవరి నుంచో తనకు సోకిందన్న దిమిత్రోవ్
టెన్నిస్ లో వరల్డ్ నంబర్ 19, ఇటీవల నంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ తో కలిసి డబుల్స్ ఆడిన గ్రిగర్ దిమిత్రోవ్ కు కరోనా పాజిటివ్ రావడంతో టెన్నిస్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గత వారం బెల్ గ్రేడ్ లో జరిగిన ఆడ్రియా టూర్ ఈవెంట్ లో జకోవిచ్, నిమిత్రోవ్ కలిసి డొమినిక్ థీయమ్, అలెగ్జాండర్ జ్వరేవ్ లను ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఎదుర్కొన్నారు.

ఆ తరువాత ఆయన మొనాకోకు చేరి, అస్వస్థత పాలుకాగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని దిమిత్రోవ్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. గత కొన్ని రోజుల్లో తాను కలిసిన వారిలో ఎవరికో వైరస్ ఉందని ఆయన పేర్కొన్నారు. "నేను ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాను. నాకు తెలియకుండా ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే నన్ను క్షమించండి. ప్రస్తుతం నేను ఇంట్లోనే రికవరీ అవుతున్నాను. ఈ క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించారు.

దిమిత్రోవ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటుండగా, ఆడ్రియా టూర్ లో పాల్గొన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, దిమిత్రోవ్ కు కరోనా సోకినట్టు తేలడంతో, ఆపై అతను పాల్గొనాల్సిన క్రొయేషియా అడ్రియాంటిక్ కోస్ట్ టోర్నీలు అన్నీ రద్దయ్యాయి.
Jakovich
Dimitrov
Corona Virus
Positive

More Telugu News