Telangana: తెలంగాణలో సింగిల్ డే రికార్డు... ఒక్కరోజే 730 కరోనా కేసులు

Telangana records single day spike in corona cases
  • 24 గంటల వ్యవధిలో 700కి పైగా కేసులు ఇదే ప్రథమం
  • జీహెచ్ఎంసీ పరిధిలో 659 మందికి కరోనా
  • తాజాగా ఏడుగురి మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రక్కసి దూకుడు పెంచింది. ఏ రోజుకు ఆ రోజు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే 730 పాజిటివ్ కేసులను గుర్తించారు. 24 గంటల వ్యవధిలో 700కి పైగా కేసులు రావడం ఇదే ప్రథమం.

జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 మందికి కరోనా సోకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,802కి చేరగా, ఇప్పటివరకు 3,731 మంది డిశ్చార్జి అయ్యారు. 3,861 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఏడుగురు మరణించారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 210కి పెరిగింది.
Telangana
Corona Virus
Record
Single Day
Spike

More Telugu News