రాష్ట్రంలో 400 మందికి పైగా అఘాయిత్యాలకు గురైతే మహిళా కమిషన్ ఏంచేస్తోంది?: వాసిరెడ్డి పద్మపై అనిత ఆగ్రహం
- అయ్యన్నపాత్రుడిపై వాసిరెడ్డి పద్మ ఫైర్
- కౌంటర్ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత
- దమ్ముంటే మంత్రులు అనిల్, వెల్లంపల్లిపై కేసు పెట్టాలని డిమాండ్
ఏడాదిగా రాష్ట్రంలో 400 మందికి పైగా మహిళలు అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు గురవుతుంటే మహిళ కమిషన్ ఏంచేస్తోందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి మహిళా కమిషన్ నిద్రలేచిందని ఎద్దేవా చేశారు. దిశ చట్టానికి చట్టబద్ధత తీసుకురాలేని చవటలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి నోటికొచ్చినట్టు మాట్లాడారని, దమ్ముంటే వాళ్లపై కేసులు పెట్టాలని అనిత డిమాండ్ చేశారు.