roja: తన తండ్రి ఫొటోలు పోస్ట్ చేసి.. రోజా భావోద్వేగభరిత వ్యాఖ్యలు

roja about her father
  • ఫాదర్స్‌ డే సందర్బంగా పోస్ట్ చేసిన రోజా
  • ప్రతి గొప్ప కూతురి వెనుక ఓ గొప్ప తండ్రి ఉంటారు
  • మార్గదర్శకం చేస్తుంటారు
  • తన ప్రేమను తన చేతల్లో చూపెడతారు
ఫాదర్స్‌ డే సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గతంలో తన తండ్రితో దిగిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్ చేసి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ప్రతి గొప్ప కూతురి వెనుక ఓ గొప్ప తండ్రి ఉంటారని పేర్కొన్నారు. తన తండ్రి ఎప్పటికీ తనతో ఉంటూ తనకు మార్గదర్శకాలు చేస్తుంటారని చెప్పారు.

మనల్ని ప్రేమిస్తున్నామని మన తండ్రి మనకు ఎన్నడూ చెప్పబోరని, తన ప్రేమను తన చేతల్లో చూపెడతారని ఆమె తెలిపారు. అమ్మాయి తొలి ప్రేమ నాన్నపైనేనని చెప్పారు. గొప్ప తండ్రిని ఇచ్చినందుకు మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా రోజా పోస్ట్ చేశారు.
roja
YSRCP
Viral Videos

More Telugu News