Atchannaidu: టీడీపీ నేత అచ్చెన్నకు అధిక రక్తపోటు.. కాళ్లు, చేతులకు తిమ్మిర్లు

TDP Leader Atchannaidu suffers with high BP
  • ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్
  • ఈ నెల 17న అచ్చెన్నకు ఆపరేషన్
  • అవసరమైన మందులు సిఫార్సు చేసిన వైద్యులు
ఈఎస్ఐ ఆసుపత్రులకు మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు నిన్న నిర్వహించిన వైద్య పరీక్షల్లో అధిక రక్తపోటు నమోదైంది. తనకు కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా ఉన్నట్టు అచ్చెన్న వైద్యులకు చెప్పగా.. పరీక్షించిన నిపుణులు అవసరమైన మందులు సూచించారు. కాగా, ఈ నెల 17న అచ్చెన్నకు సర్వజన ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.
Atchannaidu
ESI Scam
TDP
GGH
High BP

More Telugu News